అహంకారం
అహంకారం
మాత్రం సిగ్గుపడనిది..భ్రమనువీడని అహంకారం..!
తానుగొప్పను భావనామయ..మడుగువీడని అహంకారం..!
లెక్కకందని ముసుగులెన్నో..మనసుమోమున తెలియలేమే..
జ్ఞాననిధినని విర్రవీగే..తొడుగువీడని అహంకారం..!
శ్రమనుదోచుకు తినేతెలివే..గద్దెనెక్కుట చిత్రమేమరి..
ఉనికిమరచిన నీతిబాహ్యత..మురుగువీడని అహంకారం..!
డబ్బువెనుకే పరుగుతీసే..ఆటలోనే మునిగిరెవరో..
పేదవీపున కాలుమోపే..పులుపువీడని అహంకారం..!
జ్ఞానమెంతో ఉన్నదనుకొని..మాటజారే ముచ్చటేమో..
కనులు నెత్తిన మొలిచినవ్వే..మత్తువీడని అహంకారం..!
కర్కశత్వం వారసత్వం..తెచ్చునెట్లా సమానత్వం..
దుర్బలత్వపు వేర్లనడుమన..మరపువీడని అహంకారం..!
