STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేను

నేను

1 min
5


నవ్వుల వాడని..తోటను నేనే..! 
జగముల తరగని..మాయను నేనే..! 

పలుకుల ఇమడని..భాషను నేనే.. 
వ్రాయగ చిక్కని..నీడను నేనే..! 

ఎవరూ పాడని..పాటను నేనే.. 
ఆశకు లొంగని..తారను నేనే..! 

మౌనం చెక్కని..మాటను నేనే.. 
చరితగ మారని..సవితను నేనే..! 

గీయగ అందని..బొమ్మను నేనే.. 
క్రియలో ఉండని..కర్తను నేనే..! 

కర్మలు అంటని..నాన్నను నేనే.. 
కానగ దొరకని..అమ్మను నేనే..! 



Rate this content
Log in

Similar telugu poem from Classics