ఎన్నో
ఎన్నో
దిండున ఇంకిన..కడలులు ఎన్నో..!?
గుండెను కోసే..చూపులు ఎన్నో..!?
ఎవరూ చేరని..చోటది ఎచటో..?!
విరహపు గదిలో..వీధులు ఎన్నో..!?
సమాధి కట్టగ..ఇటుకలు దేనికి..?!
నిదురను మింగే..నిప్పులు ఎన్నో..!?
ప్రేమకు రూపం..ఇచ్చుట ఏమిటి.. ?!
గంధపు వాగున..మెఱుపులు ఎన్నో..!?
చందన తులసీ..గాలుల విందుగ..
శ్వాసల వీణియ..వలపులు ఎన్నో..!?
వ్రాయగ చిక్కని..భావన సాక్షిగ..
ఎగిరే పలుకుల..కత్తులు ఎన్నో..!?
