STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

పండుగ

పండుగ

1 min
15


కన్నులార నినుచూస్తూ..ఉండటమే పండుగ..! 
నీ వాడని వెన్నెల నే..గ్రోలటమే పండుగ..! 

ఎవరిపిచ్చి వారిదైన..లోకమిదే రమ్యము.. 
ఈ మాటల సాక్షిగాను..వెలగటమే పండుగ..! 

అంటుకున్న అడవి ఎంత..ఆవేదన ముందర.. 
గమనించే సంగతిలో..ఆగటమే పండుగ..! 

ఆశనంటి ఒకతెలియని..ఆవేశం కలదోయ్.. 
మూగవీణ రాగాలను..చూడటమే పండుగ..! 

పరిమళించు కలలతోట..విహారమే తియ్యన.. 
మౌనవాణి గానముగా..సాగటమే పండుగ..! 

వేదాంతము వల్లించే..పనేకదా ప్రయాస.. 
వ్రాయబడని కావ్యముగా..మిగలటమే పండుగ..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics