ఒంటరితనం నీడలో
ఒంటరితనం నీడలో
ఒంటరితనమంటే అందరుండి ఓ ఏకాంతం
ఒంటరిగా ఒక్కొక్కరు కోరుకునే విశ్రాంతం
తన మానసిక సత్సంగంతో ఒంటరితనం
తనకు తాను ఏకాకిగా మిగిలే స్వంతం
మనిషికి ఒంటరితనమంటే ఒకింత దూరం
అందరికి దూరంగా ఒక తనదైన మకాం
ఒంటరితనమంటే ఇతరులతో ఒదగక పోవడం
నిజంగా సామాజికంగా ఏర్పడే దౌర్భాగ్యం
వాస్తవంగా జగమంత కుటుంబం మనది
అనాదిగా వసుదైక భావనతో వర్ధిల్లునది
నలుగురితో నడయాడే జీవితమే జీవితం
ఒంటరితనమంటే ఓ మనో రుగ్మతకు చిహ్నం
అపుడపుడు అనవసరపు ఆందోళనలు
వయసురీత్యా పరిపక్వత లేని వ్యక్తిత్వాలు
మనిషి వ్యవస్థకు దూరంగా దయనీయం
ఒంటరిగా బతకడం ఒక మానసిక దైన్యం
కొందరికి ఆత్మన్యూనతా ఆలోచనలు
ఏవో విత్డ్రాయల్ సిండ్రోమ్లాంటి భావనలు
కలిసి మెలిసి బతక లేని ఒంటరితనాలు
తరచుగా మనిషిని కబలించు వైవిధ్యాలు
సంఘంలో మనిషికి నలుగురితోనే సహకారం
పదుగురితో కలిసివుంటేను పొందే మమకారం
మనిషియంటేనే ఉండాలి మందీమార్బలం
సామాజిక జీవనమే ఓ మంచి సత్సంగం
ఒడిదొడుకుల బతుకున ఒంటరితనం
ఏదైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణే క్షేమకరం
నిత్యం పరస్పర సహాయాలు సంక్షేమకరం
పరోపకార జీవనమే జీవిత పరమార్థం, లక్ష్యం
నిజంగా ఒంటరితనంతో ఒనగూరేదేమి లేదు
ఒద్దికగా కాస్త నలుగురితో బతకడమే మేలు
నలుగురితో నిత్యం నీవు నడుస్తూవుండు
మానవ నాగరికతకు నిలువెత్తు వ్యక్తిగనుండు !
