గాలి పాలు
గాలి పాలు
ఉబలాటపు గాలిపటం..ఆవేదన గాలిపాలు..!
కనిపించని దారంతో..బంధమదే మట్టిపాలు..!
మనసుకన్న తోడుదొంగ..ఇంకెవరోయ్ ఎవరికైన..
పలుకోర్కెల పాలపిట్ట..తానేరోయ్ దేహిపాలు..!
కోకిలయై పాడుకునే..విరహగీతి లోయలలో..
బతుకుపూల వసంతాల..వెల్లువలో అడవిపాలు..!
సీతమదిని దోచుకున్న..రామవిభుని చరితచూడు..
అసలుప్రేమ పరమార్థం..వివరించే పసిడిపాలు..!
హరివిల్లే మనసన్నది..తెలుసుకునే సంగతేమి..
వీడలేని గంధనదీ..వాహినియే ఊబిపాలు..!
ఎవరి వెంట ఎవరి పరుగు..ఎప్పుడెచట ఆగేనట..
ఆవేశపు మంటలెల్ల..ఆర్పలేని నీటిపాలు..!

