ఈ రోజుల్లో
ఈ రోజుల్లో
ఎక్కడ చూసిన ఏం చేసిన.
ఏ ప్రయాణాలు చేస్తున్నా కాని.
ఎందరిలో ఉన్నా.
ఎటు వైపుగా సాగిపోతున్నా.
మంచి వాళ్ళు తక్కువైపోతున్నారు.
చెడ్డవాళ్ళు ఎక్కువైపోయారు.
స్వార్ధపు రోజుల మధ్యలో.
నటించే మనుషులు ఎవరు ఎలాంటి వారో తెలియదు.
మర్చిపోయారు వారి సొంత ముఖం.
ఏవేవో నటనలతో నటిస్తున్నారు.
ఆశ అనే ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతున్నారు.
కొద్ది రోజుల్లోనే గొప్పవాళ్ళు కావాలని కలలు కంటున్నారు.
ఆస్తులు పెంచుకోవాలి అనేది వారి ధ్యాస.
నమ్మిన వారిని మోస్తాం చేస్తూ.
పెట్టుకున్నా నమ్మకాలు వమ్ముచేసుకొని.
ఉన్నవారు అయితే ఏం లాభం.
ఇది దేనికి సంకేతం.
రోజులే ఇలా ఉన్నాయా
లేక మారిపోతున్నారా ఈ మనుషులు కలికాలంలో
తెలియడం లేదు..
