జీవితం
జీవితం
మనసుతో ముడిపడిన..ముచ్చటయె కరగాలి..!
తీపి కోర్కెల వలను..చూపుతో కాల్చాలి..!
బ్రహ్మాండ భాండమది..దాగుంది బిందువున..
దర్శించు ఆకాంక్ష..మదిలోన పుట్టాలి..!
ఎవరితో పోటీకి..దిగుతావు ఎందుకట..
చిరునవ్వు వెన్నెల్ల..గీతముగ మిగలాలి..!
కష్టాలు కన్నీళ్ళు..కర్మఫల రాగాలు..
చక్కంగ రాలగా..కనులింట ఆగాలి..!
నీవేమొ తెలియగా..సమయమే చిక్కదా..
నీ నిదుర సమయమే..ధ్యానమున నిలపాలి..!
అనుబంధ గంధాల..మురిపాల కోకిలకు..
సరిగమలు గమకాలు..ఎవ్వరిక నేర్పాలి..!
