STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కలలెరుగని నా కన్నులకు...

కలలెరుగని నా కన్నులకు...

1 min
4


కలలెరుగని నా కన్నులకు 
కనిపించిన రూపం నువ్వు....
వలపెరుగని నా మనసునకు...
వాసంతపు తొలకరి నువ్వు...
నీ నవ్వే నా నువ్వు...
నీ స్వప్నం నా నువ్వు...


పలికించిన రాగంలో 
వినిపించే స్వరమే నువ్వు...
ఉదయించిన సంధ్యలలో
కనిపించే వెలుగే నువ్వు...
నాతో నడిచే స్నేహం నువ్వు....
నాదనిపించే నా భాగ్యం నువ్వు...
తలచిన తలపుల వాకిలి నువ్వు...
మైమరచిన క్షణమున తోడే నువ్వు...
నాకన్నీ నువ్వు...
నా స్వంతం నువ్వు...
ఈ జన్మకు దొరికిన వరమే నువ్వు...!!కల!!
 
కరుణించని కాలంలో 
చిగురించే ఆశవు నువ్వు....
మరణించని ప్రేమలలో...
జీవించే శ్వాసవు నువ్వు...
నా చీకటి దీపం నువ్వు...
నను వీడని ప్రేమవు నువ్వు...
నిను వలచిన నా మనసే నువ్వు...
నిను పిలిచిన ఆ పిలుపే నువ్వు....
నా దారివి నువ్వు...
నా గమ్యం నువ్వు...
నను బ్రతికించే నా ప్రాణం నువ్వు..


Rate this content
Log in

Similar telugu poem from Classics