నన్ను నేను
నన్ను నేను
నన్ను నేను చూసుకునే..వేళలోన నవ్వాగదు..!
నిను విడిగా చూడాలను..కున్నానా ఏడ్పాగదు..!
ఎవ్వరేమి అంటేనేం..ఎవ్వరెలా ఉంటేనేం..
బాధపడక ఉండమంటె..పడేపడే మనసాగదు..!
వేదనతో అనుబంధం..వేనవేల జన్మలుగా..
ఆవేదన తగదంటే..తెలివిలేని తగవాగదు..!
నిజరాక్షస సంహారము..చేయలేని రాజసమే..
దైవత్వము మరచుటచే..ఆటాడే గుణమాగదు..!
పరువాలను ఎఱవేస్తూ..గడుపుకునే పబ్బమేదొ..
బలహీనత పాలబడిన..అబద్ధాల బతుకాగదు..!
చెప్పాలను గొడవ సరే..అసలు వినే సహనమేది..
అహంకార వికారమే..సొంతమైన వగరాగదు..!
