మనోహరం
మనోహరం
నన్ను నేను దిద్దుకునే..పనే కదా మనోహరం..!
అనుక్షణం నేర్చుకునే..పనే కదా మనోహరం..!
ఏదైనా చూస్తూనే..అవగాహన కలుగునెలా..
లోపలెఱుక నిలుపుకునే..పనే కదా మనోహరం..!
తీపి చేదు అనుభవాల..దీపావళి కావ్యమిదే..
శ్రద్ధపెట్టి చదువుకునే..పనే కదా మనోహరం..!
సహనవనం మనసైతే..పరిమళించు జీవితమే..
అహం సరిగ రాల్చుకునే..పనే కదా మనోహరం..!
మెఱుపల్లే బతుకుతీరు..తెలియవలసి ఉన్నదిలే..
నీలో నువు నవ్వుకునే..పనే కదా మనోహరం..!
ఈ జన్మకు గొప్ప వరం..ప్రేమ గుట్టు పట్టడమే..
మనసు పట్టు వదులుకునే..పనే కదా మనోహరం..!
