కన్నమనసు
కన్నమనసు
జన్మనెత్తు రోజునన్ను మహాలక్ష్మి అన్నారూ
చదువుకునే రోజులలో సరస్వతివి అన్నారూ
క్రీడలందు రాణించిన మహాశక్తి నేనుయనీ
అక్కున జేర్చుకొన్న తల్లిదండ్రులార! వినండీ!
యవ్వనమే ఆరంభం కానినాడు పెళ్ళిజేసి
రెండుపదుల ఆంతర్యం నాభర్తకు నాకుయుండ
గుండెబరువు తీరిందని సంతోషం చెందినారు
నానలవై ఏడులోన ముండమోపి జేసినారు
కుటుంబపూ బాధ్యతలూ మోయలేక సాయమడగ
మీరంతా చేతులెత్త బ్రతుకుభార మయ్యిందీ
సంతానపు సంక్షేమమె లక్ష్యంగా చేసుకొనీ
ఒడలుమరచి కృషినిచేసి నిలుచున్నా పుడమిపైన
పైచదువులు చదివించీ నాకాళ్ళన నిలబడగా
సరిజోడును నాకిచ్చీ పెళ్ళిచేసి నట్లయినా
నాకింతా కష్టమేల మీకింతా దుఃఖమేల
మారండీ బాల్యవివాహాలనసలు ఆపండీ
