STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ప్రతిక్షణం

ప్రతిక్షణం

1 min
10



ప్రతిక్షణం అద్భుతమే..కొత్త జన్మ ఇచ్చేస్తూ..!
జీవితమిది మనోహరం..పాఠాలను నేర్పేస్తూ..!

మాటలేల సరిపోవును..అక్షరమే ప్రేయసియే..
మౌనమేమొ మధువేలే..గమ్మత్తున తేల్చేస్తూ..!

వంశవృక్ష వసంతాల..సంబరమది యుగాలుగా..
సంసారపు మాయగంధ..సౌరభాల ముంచేస్తూ..!

తెంచుకోను బంధాలే..లేవన్నది బోధపరచు..
లేని మనసు వినోదాల..సాక్షి సరిగ నవ్వేస్తూ..!

ప్రతి కోకిల పాడుతున్న..తీపిపాట వగరు ఫలం..
ఆరురుచుల విలాసమే..విరహపుసుధ నింపేస్తూ..!

పలుకుతేనె కేమున్నది..పరవశించు కనులమాటె..
లేఖలకే అందకుండ..ఎదలోయల దాచేస్తూ.


Rate this content
Log in

Similar telugu poem from Classics