తల్లీ వందనం
తల్లీ వందనం
తల్లీ వందనం....నను కన్నతల్లి అభివందనం...
అమ్మా నీ మనసు నవనందనం...
మురిపాల కొమ్మా శిరసాభివందనం...
నీ హృదయం ప్రేమ కలశం...
నీ లాలనం మధురాతి మధురం...
అవధులు లేని అనురాగం నీ స్వంతం....
కల్మషము లెరుగని మమతకు నీవు చిహ్నం...
తల్లీ వందనం....నను కన్నతల్లి అభివందనం...
అమ్మా నీ మనసు నవనందనం...
కవులకు అందని భాష నీప్రేమ కావ్యం....
పండితులు వ్రాయలేని గ్రంథం నీ అనురాగ బంధం.....
మరుదైవమై పుట్టి ఈ పుడమిలో...
గుడి కట్టుకున్నావు మా మనసులో......
నవమాసాలు మోసేవు ఉసురు పోస్తూ....
పునర్జన్మనెత్తేవు మరు జన్మ నిస్తూ....
తల్లీ వందనం....నను కన్నతల్లి అభివందనం...
అమ్మా నీ మనసు నవనందనం...
అమ్మా అను నీ పిలుపు ఆప్యాయతను తెలుపు...
నీ లాలి పాటలు బిడ్డల అలసటను మరపు....
హాయిగా నిదురోను ఉయ్యాల లోన....
పెరిగి ప్రయోజకులయ్యేరు నీ ప్రేమ వలన...
త్యాగశీలీ...నీవే కదా ఇలన ప్రతి ఇంటి దీపం...
అనురాగ శీలీ...నీవే కదా భువిన ఏకైక దైవం....
తల్లీ వందనం....నను కన్నతల్లి అభివందనం...
అమ్మా నీ మనసు నవనందనం...
మురిపాల కొమ్మా శిరసాభివందనం...
నీ హృదయం ప్రేమ కలశం...
నీ లాలనం మధురాతి మధురం...
అవధులు లేని అనురాగం నీ స్వంతం....
కల్మషము లెరుగని మమతకు నీవు చిహ్నం...
