ఓ మనసా
ఓ మనసా
అందావని తెలిసి ఆశ పెడతావు.
కన్నీటి వర్షంలో తడిపేస్తావు.
గాయం లేకుండా నొప్పిని రప్పిస్తావు.
ఏదో లోకం లో తోస్తేస్తావు.
బాధపెట్టి గుండె బరువు చేస్తావు.
జరుగుతుంది అనేలోపు
జరగనివ్వకుండా చేసి వదిలేస్తావు.
ఏదో మాయ చేస్తావు ఊపిరుంచి.
ఆలోచనల్లో ముంచేసి అవధులు దాటిస్తావు.
ప్రతి రోజు మండే నిప్పుల కుంపటి ల మండిస్తావు.
దారులు తెలిసి నడక ఆపేస్తావు.
నిజమనుకునే లోపు అబద్ధం చేస్తావు.
ఎన్ని ఆటలాడిస్తావు.
ఎన్నో ఓటములు పరిచయం చేస్తావు.
కంటి మీద కునుకు లేకుండా చేసి
రాత్రులు ఉదయాలు లేకుండ చేస్తావు...
