దీపం లక్ష్మీ
దీపం లక్ష్మీ
తలవాకిట ముగ్గు పెట్టు..ఇల్లాలే దీపలక్ష్మి..!
పతిదేవుని సేవనుండు..భామినియే భాగ్యలక్ష్మి..!
సంసారపు గుట్టుసరిగ..కాచుపనికి అంకితమే..
అమ్మతనం సాక్షియైన..మగువ తనే మౌనలక్ష్మి..!
బాధలన్ని చిరునవ్వున..దాచిపెట్టు కోమలిరో..
గుండె తడిని బతికించే..గువ్వపిట్ట స్నేహలక్ష్మి..!
ఎన్ని పనులు చేసేనో..స్వేద నదిగ మిగిలిపోయి..
మేనుమరచి అన్నిమరచు..తన్వితనే సహనలక్ష్మి..!
తనను తాను నవజీవన..కావ్యముగా నిలుపుకోగ..
ప్రశ్నించే గుణములకే..సెలవిచ్చిన శాంతలక్ష్మి..!
పేగుబంధ మధురిమలో..తేలిపోవు కరుణామయి..
కష్టాలకు కన్నీళ్ళకు..జోలపాడు జ్ఞానలక్ష్మి..!
