STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ లాలస

ఓ లాలస

1 min
6



అబద్దాల జీవితమిది..అందమైన ఓ లాలస..!
గొడవపడే మనసుపట్ల..చిత్రమైన ఓ లాలస..!

అనుబంధపు మేడలోన..ఓ గదిలో బందీగా..
వ్యామోహపు రాగసుధల..ఇష్టమైన ఓ లాలస..!

లేఖ వ్రాసి ఇవ్వలేదు..పెదవి విప్పి చెప్పలేదు..
మోయలేని యాతనలే..అడ్డమైన ఓ లాలస..!

ఎఱుక ఉండి లేనట్లే..వ్యవహరించు తనమేదో..
రుచులకథా వీధులలో..గంధమైన ఓ లాలస..!

ఎగిరిపోవు రాచిలుకల..నిలువరించ లేరెవ్వరు..
ఊరించే తోట పట్ల..హృద్యమైన ఓ లాలస..!

ఓటమింట మరిగిపోతు..గెలుపందని ఆవేదన..
రగులుతున్న విజయకాంక్ష..దారమైన ఓ లాలస..!


Rate this content
Log in

Similar telugu poem from Classics