ఆఖరి నిమిషం
ఆఖరి నిమిషం
ఆ క్షణం కళ్ళ ముందు కనబడుతుంది.
ఎవరినైనా బాధ పెట్టనా.
మాటలతో మనసు విరిచేశాన.
నమ్మకాలు వమ్ము చేసి మోసం చేశానా అని.
నా ప్రవర్తన వల్ల ఎందరి మనస్సు గాయపడిందో.
ఎన్నిసార్లు కన్నీళ్లు చిందించారో.
సంతోషపడ్డారో వేదన అనుభవించారో.
ఒక్కరైనా అనుకున్నారో ఏమో
ఇలా ఉన్నాడు ఏంటి ఈ మనిషి అని.
కళ్ళ ముందు కనబడితే జీవితం
వచ్చే ఆ చావు సైతం భయపెడుతుంది.
మంచి చేయకపోయినా పర్వాలేదు.
ఇంకొకరి చెడు కోరి సాధించేది శూన్యం.
వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేవు.
పోయేటప్పుడు ఏం తీసుకుపోవు.
విలువలతో కూడిన జీవితం జీవించు
ఆ చావు వచ్చే ఆ నిముషాలు ముందైన
ఏ ఒక్క ప్రాణాన్ని బాధ పెట్టలేదు అనే
ప్రశాంతమైన జీవితం గడిపాను అని అప్పుడు పోవాలి
ఆ పోయే ప్రాణం.
