వాళ్ళు
వాళ్ళు
ఎన్నో వేల కళ్ళు నిన్ను గమనిస్తున్నాయో.
ఎన్నో మాటలు ఏ చెవిన పడుతున్నాయో.
ఎన్నెన్నో గుసగుసలు.
మరెన్నో విషయాలు మనిషి చుట్టు.
మాట్లాడిన తప్పే.
మాట్లాడకపోయినా వింతే.
ఎలా ఉన్నా ఇబ్బందే.
అర్థం చేసుకునేది ఆవగింజంత.
అపార్థం చేసుకునేది కొండంతా.
వాళ్లకు ఏం కావాలో తెలియదు.
ఏదో ఆతృతలో ఉంటారు.
అన్ని నాకు తెలియాలనే ఉబలాటం.
ఏమో ఏదో అని ఆలోచిస్తారు వాళ్ళల్లో వాళ్ళే.
అన్ని విషయాలు కావలి.
ఏం జరిగిన తెలియాలి అనే ఆతృతలో ఉంటారు.
వారి గురించి కన్నా పక్కవాళ్ళ గురించి ఆలోచనలు ఎక్కువ.
వారు మారారు అలానే గడిపేస్తారు వారి జీవితాంతం.
