ఆ చివరి
ఆ చివరి
కోన ఊపిరి తో కొట్టు మిట్టాడే ప్రాణానికి లేదు
గ్యారెంటీ.
ఎన్ని లక్షలు ఖర్చు చేసిన.
ఎంత విలువైన మందుకు తెచ్చిన.
ఏ దేశాలకు తిప్పిన.
ఎంత మంచి ఆసుపత్రి లో చేర్పించిన.
ఎంత గొప్పవారైనా.
మేధావి అయిన.
ఎన్ని కన్నీళ్లు చిందించిన.
నీ ఇల్లు ఇంద్రభవనమైన.
నిమిషాల మీద సంపాదించిన.
బంగారు కంచంలో భోజనం చేసిన.
వందల మంది సెక్యూరిటీ గా ఉన్నా.
అందరితో ఉన్నా ఒంటరిగా ఉన్నా.
పోయే ప్రాణం ఆగదు.
అపలేవు ఎంత అనుకున్నా.
వస్తె తీసుకెళ్లిపోతుంది.
ఎవరి సమయం వచ్చినప్పుడు వారు
వెళ్ళి పోవాల్సిందే ఆ కటికి.
ఒంటరిగా వచ్చావు
ఒంటరిగా పోతావు.
ఇదే అసలు నిజం నీ పుట్టుకకు అర్థం...
