STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నిను వీడి నేనుండలేను

నిను వీడి నేనుండలేను

1 min
0


నినువీడి నేనుండలేను,
నను కాదని నీవెళ్ళలేవు,
అణువు అణువులో ప్రేమదాచుకున్నాము,
కణము కణము 
వలపు నింపుకున్నాము.

రతీ మన్మధుల 
సుందర దివ్యతేజము 
మనలోనూ వున్నది,
రాధా కృష్ణుల మనసులోని 
ప్రేమే మనదైనది,
లైలా మజ్ను శృంగారకావ్యం
మన ప్రేమకే అంకితమైనది,
చంచలం కాని మన మనసే 
గుండెను వీడి పోలేకున్నది.

ముద్దొచ్చే చెక్కిలి ఆరాటం 
తోడునీడల జీవితానికి వరమైనది,
పెనవేసిన అనుబంధంలో 
విరహానికి చోటే లేకున్నది,
అద్దాలగదిలో 
కవ్వింతల మాటలు 
గడప దాటకుండా కాపుకాయడం భలేగున్నది,
దరహాసపు సంతోషాలు 
ప్రణయ స్తుతి వల్లిస్తూ 
ప్రేమలోని మాధుర్యం పల్లవిస్తున్నది.


Rate this content
Log in

Similar telugu poem from Classics