శ్రీ హనుమ
శ్రీ హనుమ


ఘనమైన పుజలు నే చేయలేనో వాయునందన నీల
మేఘశ్యాముని చిత్తమందు నిలుపుటతప్ప ఓఅనిల
కుమార ఆశీస్సలీయవో అంజనా సుత మమ్ము అగాధము
లనుండి బయల్పడేవో భద్రాద్రి వాస దాసా
వైదేహి దుఃఖ నివారక ఓ వాలి సహోదర సన్నిహితా
విపత్తులు దీసివేయవో మాకు విజ్ఞాన విజ్ఞతలనీయవో
విరించి సతి శ్రీ సరస్వతీ సమాన గాత్రా విజయము
వినయము జతచేసి మాకందించవో విపణి విహారా