STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కలగా మిగిలింది

కలగా మిగిలింది

1 min
0


చిన్ననాటి నుండి కనుదోయలలో 
కమ్మని కలలే కంటుండే దాన్న
ఏ వయసు కావయసు కలలు మారుతుండేవి 
పాత కలలన్నీ అలల తాకిడికి కొట్టుకుపోయేవి 
సరికొత్త కలలకు దారి దొరికేది

ఓ కల మాత్రం ఎప్పుడూ నా తోనే నా లోనే
కొంత మార్పు చేర్పులతో ప్రయాణిస్తూండేది ,
ఏ ఉప్పెనలకు,పెను గాలులకు కొట్టుకుపోకుండా 
దృడ నిశ్చయంతో ప్రయాణిస్తూ ఉండేది

సందె పొద్దుకు చేరుకున్నాక సూరీడు 
సేద తీరడానికి నిష్క్రమిస్తాడు ,
పక్షులన్నీ తమ గూళ్ళకు చేరుతాయి,
మనుషులందరూ గూటికి వెళతారు,
కాని కునుకు తీసే సమయానికి ఎప్పటిలాగానే
నా కల నన్ను వెంటాడుతుంది

పాల సముద్రంలో ఈదుతూ,పండు వెన్నెల్లో 
విహరిస్తూ,బంగారు హంసతూళికా తల్పం
పై పవళించి బంగారు కలలు కంటూ,
కల,కళ,కాసులకై కంటూ కలగా మిగిలింది,
నెరవేరలేని వ్యధగా మిగిలింది 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics