STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వారుండరు

వారుండరు

1 min
5


స్వానుభవం , చైతన్యం పంచుకోని వారుండరు!
స్వాతిశయం పడగలన్ని దించుకోని వారుండరు!

నీతులంటె బోరంటూ పరుగిడెనే చిన్నారులు
చందమామ కథలకు చెవి కోసుకోని వారుండరు!

పండితులను ప్రశంసిస్తు కీర్తిస్తూ ఉంటారే!
వారి విలువ లోకంలో చెప్పుకోని వారుండరు!

వెలుగు దివ్వె, కంటిపాప పసిపాపయె కాదా మరి!
చంటి పాప చేతికిస్తె ఎత్తుకోని వారుండరు!

వెలుగునీడ జీవితమే సుఖదుఃఖము కలయికనే
తెలివితోడ నడచుకుంటె దాటుకోని వారుండరు..!

ఆకలితో అలమటించు పేదలవెతలే చూడగ
కాఠిన్యపు కవచమునే విప్పుకోని వారుండరు..



Rate this content
Log in

Similar telugu poem from Classics