STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

3  

Midhun babu

Classics Fantasy Others

లవ్. జిహాద్

లవ్. జిహాద్

1 min
7



ఆర్థిక రెక్కలు మొలిచిన పక్షులు
అమాయకపు గొర్రెలు
విపరీత స్వేచ్ఛతో విహరించాలనుకునే వారు
చేతుల్లో సెల్ ఫోన్ వికృతాలకు ఆకర్షితులై
మంచి చెడు మార్గదర్శనం కరువై
అన్నీ తమకు తెలుసనుకొని బోల్తా పడ్తున్న యువత 

విదేశీ సంస్కృతి విచ్చలవిడితనం విస్తరణ
నేర్చుకునే విద్యలో నీతి నియమాల లోపం
ఉమ్మడి కుటుంబాల బంధాలు సన్నగిల్లడం
ఆర్థిక అనుబంధమే ముఖ్యంగా భావించడం
ఉద్యోగాల బిజీలో తల్లిదండ్రులు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు
దారి తప్పిన మార్పు అవుతుంది వేగవంతం
యువత ఆలోచనలలో అపరిపక్వత 

చిల్లర చిత్తులైన సామాజిక బంధాలు
అన్ని గమనించిన లవ్ జిహాదీ నక్కలు
ఎరవేసి గాలం వేస్తున్నాయి చేపల కోసం
మాయమాటలతో కమ్మిస్తున్నాయి మైకం
వలలో చిక్కిన పక్షులు బయటపడలేక సతమతం
ఎదుర్కొనే ధైర్యం లేక వెడ్డిగా చెరసాలలో
వెనక్కి రాలేక కొన్ని ఆత్మహత్యలు
వెలుగులోకి వచ్చిన కథలు మచ్చుకు కొన్నే 

జిహాదీ జిత్తులు తేటతెల్లమైతే, జన వ్యాప్తమైతే
తెరుచుకుంటారు కళ్ళు కొందరైనా
చట్టపరమైన శిక్షలు కఠోరమైతే
భయాలు కొన్ని వేస్తాయి వెనుకంజ


Rate this content
Log in

Similar telugu poem from Classics