STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఎవరికి ఎదురుపడని వాణ్ణి

ఎవరికి ఎదురుపడని వాణ్ణి

1 min
7



ఓ పుట్టినరోజంటూ లేని వాణ్ణి..
ఎన్ని వందల వేలసార్లో వచ్చి పోతున్న వాణ్ణి..
అయినా..
నేనెప్పటికీ పుట్టని వాణ్ణే..!

ఎన్ని పెద్ద చదువులో చదివేసిన వాణ్ణి..
వెర్రి పరిశోధనల్లో మునిగి తేలిన వాణ్ణి..
కాలాన్ని తిరగేసిన వాణ్ణి..
ఇంకా అక్షరాభ్యాసం కూడా కాని వాణ్ణే..!

ఎన్ని యుద్ధాల్లోనో పాలు పంచుకున్న వాణ్ణి..
గెలుపోటముల లెక్కే లేని వాణ్ణి..
ఏ ఒక్కరినీ హింసించని వాణ్ణి..
కన్నతల్లుల శోకాన్ని కన్నవాణ్ణే..!

ఓ మనస్సుగా లేని వాణ్ణి..
అసలు నా అన్న వాళ్ళే లేనివాణ్ణి..
ఎవరికీ ఏమీ కాని వాణ్ణి..
అందరూ నా వాళ్ళే అయిన వాణ్ణే..!

భయమంటే తెలియని వాణ్ణి..
అభయమెవరికీ ఇవ్వలేని వాణ్ణి..
కష్టనష్టాలంటూ లేని వాణ్ణి..
ఏ లాభం ఆశించని వాణ్ణి..
అనుభవాల పుస్తకాన్నై మిగిలిన వాణ్ణి..!

నాగలి పట్టని వాణ్ణి..
బంగారం పండిస్తున్న వాణ్ణి..!

ఏ వేణువు పట్టని వాణ్ణి..
మౌనమధుర గీతం లా..
ప్రవహిస్తూ ఉన్న వాణ్ణి..!
నేనే నీవుగా..
మరణంతో ఆడుకుంటున్న వాణ్ణి..!


Rate this content
Log in

Similar telugu poem from Classics