STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఇంకా

ఇంకా

1 min
4


ప్రమాణాల వెన్నెల తడి..ఆరలేదు ఇంకా..! 
నీ చూపుల సంతకాలు..చెరగలేదు ఇంకా..! 

కన్నులతో కొలువలేని..సోయగాల రాశీ.. 
నీ పూజకు పూవులేవి..దొరకలేదు ఇంకా..! 

మాటలెల్ల ఆగిపోయె..గుండెసడికి వెనుకే.. 
మంత్రించిన నీ తలపే..చెదరలేదు ఇంకా..! 

నీ వాడని నీడలోన..సేద తీరుటెపుడో.. 
ఈ వలపుల మల్లికలే..వాడలేదు ఇంకా..! 

కలనుచెరిపి వెళ్ళావని..కలహించగ చూడను.. 
మనసుకింత నిగ్రహమే..చిక్కలేదు ఇంకా..! 

మధురమైన ఏకాంతపు..సందడెలా తెలుపను.. 
పాడుకోగ పదములేవొ..దొరకలేదు ఇంకా..! 


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Classics