నీ కోసం సఖీ
నీ కోసం సఖీ
నువ్వనే ప్రాణం దరికి చేరవని తెలిసి
నేననే లోకం చావైనా బ్రతుకైనా నీతోనే అంటూ
కాలం రాసిన ఎడబాటులో భరిస్తున్న
నిమిష నిమిషం ఒక తీరని వేదనగా
నువ్వే నేను అనుకున్న బంధం చెదిరాక
కంటినిండా నిద్ర లేని రాత్రులు కంటతడి
పెట్టడంతో జారిపోతుంటే
భారమైన నీ స్మృతులు నన్ను నలిపేస్తుంటే
సలిపే గుండె ఆగిపోని ఇప్పుడిలా
జీవితకాలం పాటు నీకోసం సఖీ...

