వయ్యారి వాన లేఖ
వయ్యారి వాన లేఖ
వాన దేవా..!
అప్పుగాని చేసేవేంటయ్యా భూమాతకి
వడగళ్ళతో వడ్డిని
భారివర్షలతో బాకిని,చెల్లించి
మా కష్టానికి నీవు కన్నీరు కార్చి
మాకు తొడుగా నీ తొలకరి జల్లులను చేర్చి
నీ ఊరుముల సంగీతంలో ఊయ్యాలలు ఊపి
బాధలో ఉన్న భూదేవి కి భరోసా నిచ్చి
రైతన్న రాజ్యాన్ని సరిదిద్ది,వెళ్లిరావయ్యా ఈ ఎడాదికి
రుణం అయిపోయాం తండ్రి నీకి ఈ జన్మకి
