మౌనరోధన
మౌనరోధన
నువ్వు చెప్పాలనుకున్నది చెప్పకుండా వెళ్ళిపోయినా
నువు మళ్ళీ కలవకుండా పోయినా
గుండెగుడిలో నిన్నే కొలువుంచినా
ఎదురుచూపులతోనే కాలం గడుపుతూవున్నా
ఇప్పుడు కనిపించి కల్లోలం రేపి వెళ్ళిపోయినా
నిన్నేమీ అనను నా దురదృష్టానికి నేనే
గుండెపగిలి రక్తమోడుస్తున్నా
మౌనంగా రోదిస్తున్నా
నేనెల్లపుడూ నీ సంతోషమే కోరుకుంటున్నా..

