గోరింట
గోరింట
పూసింది పూసింది గోరింట
పూసింది పూసింది గోరింట
సిరులెన్నో తెచ్చింది ప్రతియింట
ముద్దుగుమ్మల ముచ్చట తీర్చగా
పుణ్యముల రాశులు పేర్చగా
వచ్చింది వచ్చింది ఆషాఢ మాసం
తెచ్చింది తెచ్చింది సంతోష సమయం
కలవారి కోడళ్ళు కన్నె పిల్లలు
కలిసి చేసేరెన్నో వేడుకలు
గోరింట పండితే కొండంత ప్రేమ
దొరుకునంచునీ తరుణుల ధీమ
సతి హస్తాలలో నిండిన యెరుపు
పతి హృదిలోన పెంచును వలపు
ఆరోగ్యదాయినీ కురవక తరువు
ఔషధగుణములిందులో కలవు
ఆషాఢమాసంపు ఆచారవ్యవహారాలు
ప్రజల కందరికీ ఆమోదయోగ్యాలు
పెద్దలు నుడివిన ధర్మ శాస్త్రాలు
మనకిడు జ్ఞాన ప్రదీప్త దివ్య జ్యోతులు
పర్వదినాల పేరుతో ఆరోగ్యసూత్రాలు
ఆచారింప చేసిరి మన వేదవిదులు
భారతదేశపు సంస్కృతీ విభవాలు
జగత్తుకంతటికీ మార్గదర్శకాలు.//
