కాలాయనమః
కాలాయనమః
తేటగీతి మాలిక🦜
కాలమున మార్పు సహజము గాలలీల
గాగనగ నేఁడు పెక్కు వికారములివి
యింటి యింటిలో తిష్టగ యిక్కటులను
పూర్వ పుణ్యము నునశింప బూని చేయ
గతపు పెద్దల నీతులు గతియె నీకు
సన్నుతాంగుని గొల్చి శాంతి నొంది
కలసి వచ్చును నేదైన కాల మహిమ
ద్వాదశాదిత్యులు ను గాచు వరము లిడును.
కన్న వారిని వదలక కరుణ కల్గి
నిత్య సేవలు జేయుము నియతి మీర
కాల పురుషుడు మెచ్చును కలలు దీర్చు
కాల మన్నది నియమమై కదుపు బ్రతుకు.
సర్వ జనులను రక్షించి సముదితముగ
కాల మేచూచి యిచ్చును శరణు గోర
కాల లీలలు గానరే కథల వెతలు
కాలచక్రము నేర్పును గమన రీతి..
కాలుడును మెచ్చు నీతిగ కరము గలిపి
ఐకమత్యంబు ప్రజలుండ తాక మనగ
భయము జెందును సత్యము నయము వినుము
సర్వ మానవాళి కి ప్రేమ సకల శుభము..!!
✍️చావలి బాలకృష్ణవేణి
19::4::'23
8341353323
