దేవీప్రార్ధన
దేవీప్రార్ధన
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः
చెలిమి కలిమి బలిమి కొలిమి లతో దేవీ ప్రార్ధన..
చం..
చెలిమికి నీవె కారణము, చేతన మిచ్చు భవానిమాతవై
కలిమినిగూడ నీయుము శుభాంగి! ప్రదీప్తము నీదు శక్తులే!
బలిమిని జూఁపి దుష్టులను బంధములో పడవేయుమమ్మరో!
కొలిమియె నీకు సిద్ధము గకోవెల యందున ధూపమీయగాన్!!
చావలి బాలకృష్ణవేణి
10/10/'24
