శివకేశవులు
శివకేశవులు
ఉత్పలమాల
బాధ్యత నీవె యిచ్చితివి భారము దింపుమ, నాదు కామ్యమే
సాధ్యమ! జెప్పుమా! జయము! శంకర! ఈశ్వర! చంద్రశేఖరా!
ఆద్యము నీకు నర్పితమె! యంబర లోచన! పార్వతీప్రియా!
తధ్యము లింగమందు గని తన్మయ మొందుచు దృష్టి నిల్పుదున్!!
నేడు ఐచ్ఛికము..
ఉత్పల
ఆటగ మారెజీవితమె, యాదుకొనంగనె రావ,దేవ! నా
బాటను భక్తిమై నఁడుప బాధ్యత నీదయ వేంకటేశ్వరా!
కాటును వేయులోకమిది కౌరవ నాశక! కాంచవేలనో!
కైటభ వైరి యౌవత శిఖామణి వెంటను బ్రోవరావదే!
@చావలి బాలకృష్ణవేణి
25/01/'25
