గణపతిః
గణపతిః
ॐॐॐ
श्रीगुरूभ्योनमः
ద్విపదలు
అంశము.
🙏. మహాగణపతి కి హృదయాంజలిః🙏
గుణముల లోనతగుశుభగు లేరి?
గణముల కధిపతీ! గజముఖ వరద! 1
పార్వతి ప్రియ పుత్ర! భాగ్యవిధాత!
నేర్వగ ఛందము నీదయ దాత! 2
త్రాతవు నీవయ దండము సామి
భ్రాతవు స్కందుని పలుకవదేమి? 3
శీతవికాసము చేయుము బుద్ది
వ్రాతను మార్చుమ రంజిలు సిద్ధి! 4
తల్లికి దండ్రికి దండము లీయ
కొల్లగ జేర్చితి గుండెల హాయి! 5
శృతిగూఁడి నాట్యము నీధృతి జూఁపు
కృతిగొన నందము నీదయ జూఁపు! 6
శృంగికి చేతన మీయగ నీవె
భృంగికి రావగ తేకువ నీవె! 7
కైలాసమునగల కళలకు రాజ
శైలాట వదనుడ శాస్త్రవిరాజ! 8
అచరణ హృదయార వంద్యుడ పాహి!
విచలిత జన్మకు విద్యలు దేహి! 9
గురువుల రూపముఁగూర్చిన దేవ
బరువును దీర్పగ బంధమై రావ! 10
గుజ్జువేలుపు మాకు కోర్కెలీడేర్చు
బొజ్జదేవర వేలు మ్రొక్కులీడేర్చు! 11
వక్రతుండ గనుమ వాక్సిద్ది నిడుమ
వక్రబుద్దిని జీల్చు వందనములయ! 12
తోరణమునుగట్టు దూతను పంపు
కారణము కొఱకు కాలును మోపు! 13
భక్తి ప్రపత్తులఁ పాపము బాపు
శక్తియుక్తుల దాత శాంతిస్వరూప14
కుఁడుములు సిద్ధము కోవెల లోన
యఁడుగులు వేయవె యంబర నాథ! 15
ఇఁడుములు దీర్పవె విఘ్నవినాశ
ముడుపులు గట్టగ మూలప్రకాశ! 16
చెఱుకుగడలు గల శ్రీకర పూజ
తఱచుగ చేసెద
తథ్యము తేజ! 17
ఎలుకవాహనము నీకేయిది సామి
పలుకువరములవీ ప్రభలుగ సామి! 18
మదిలో ని నీ అభిమానము మెండు
హృదిలోనె నిలకడ నీవయి
యుండు! 19
మంగళ మందుకో మ మహిమోపేత
భంగము కానిది భక్తియె నేత!! 20
🙏🙏🙏🙏🙏🙏🙏
✍️చావలి బాలకృష్ణవేణి
12/02/2025
