చిత్త చింతామణిః
చిత్త చింతామణిః
ॐॐॐ ।
-----------------
చిత్త చింతామణిః
ర ర ర న జ త త త గ //10యతి
18యతి..
కంటిలో నీవు నుండంగ నాకగున విచార మున్ వేగ కైవల్యమున్ ప్రేమతో
వంటిలో జేరి నిత్తువ్ గదా వరమును పార్వతీ సేవ లేలంగ మాతంగి మా
యింటిలో పుణ్యమున్ వర్ధిలన్ నియతిగ బూజ లొనర్చి యిచ్చు పదార్థంబు నీ
పంటిలో చేరతృప్తిన్ గొనుమ్ భగవతి! భారతి! శుభ్ర వస్త్రాన్వితా! దేవికా!!!
✍️చావలి బాలకృష్ణవేణి
6/1/'23
