STORYMIRROR

Midhun babu

Romance Classics

4  

Midhun babu

Romance Classics

నిండు పున్నమి వెన్నెల

నిండు పున్నమి వెన్నెల

1 min
300

 నిండు పున్నమి జాబిలున్నా మసకబారెను తారలెందుకు 

గాలితెమ్మెర వీయుచున్నా విసుగుచెందెను తారలెందుకు 


వెండి వెన్నెల వెలుగు ఛాయలో

కలువ భామలు మురియుచున్నవి

సఖుడు చెంతనె చేరియున్నా అలకబూనెను తారలెందుకు 


మురిసి చకోర పక్షి  తేనెలు గ్రోలి మోదము యెంతొ పొందెను 

సుధాకరుడూ చేరువైనను మురువకుండెను తారలెందుకు 


గండుకోయిల  కూసి పాడితె మధూమాసము పులక రించెను

'రాజు' తళుకుల సొగసు చూసిన మెచ్చకుండెను

తారలెందుకు 


రేని కోసం వేచి చూసెను వన్నె చిన్నెల ఆభిసారిక

ఎదుటె కాంతుడు పిలుస్తున్నా పలుకకుండెను తారలెందుకు 


నిదురమానిన మధువు కీటము పూల చెలులతొ ఆడుతున్నది 

చెలుడు సరసము లాడుతున్నా

నిందలాడెను తారలెందుకు 


"మధు"ర రవళులు మెచ్చనొల్లని గగన సుమములు కినుక బూనెన..?

మేలి గంధము 'రాజు'మేనుల అలదకుండెను తారలెందుకు..?


      


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance