ప్రాసాక్షరి
ప్రాసాక్షరి
ప్రసాక్షరి కవిత
*సస, మమ, రర, నానా, దద, ముము*
ఈ (స)మయములో వేగ
నీ (స)న్నిధినే చేరుకొన్న
కో(మ)లి మనసెరుగలేవ?
ప్రే(మ)గ నను గాంచలేవ?
కా(ర)ణమేమో తెలుపరాద!
వే(ర)ము వీడి పలుక రాద!
గా(నా)మృతమే పంచలేవ!
శ్రీ(నా)థా!చెంత చేరరావ!
ఆ(ద)రముతో చూతువనుచు
నీ(ద)రి చేరగ గాసి పడుచు
ఈ (ము)నిమాపున నీకై వచ్చితి
నా (ము)రిపాలను తోడి తెచ్చితి.//
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
