వెనుకటి తరం !
వెనుకటి తరం !
వెనుకటితరం ఒకరకంగా
తర్వాత పుట్టినవారికి ద్వారం .
వారి తపన గుర్తించదగినది
నిజంగా ! ఎందుకంటే ,
ఇంత బాగుంది గనుక మన యవ్వారం .
తాత ఖద్దరుపంచె , లాల్చీ కట్టుకుని ,
కండువా భుజాన హుందాగా వేసుకుని .
అవ్వ జరీచీర ఒంటినిండా కప్పుకుని ,
ఎర్రని కుంకుమబొట్టును సింగారించుకుని !
కిర్రుచెప్పులేసుకుని ఎంతో ఠీవిగా నడుస్తుంటే ,
వారిలో సహనశీలత స్వయం భూదేవిలా .
ఇంటినిండా సంతానం కళకళలాడుతుంటే ,
పెరడు పూలు , పండ్లతో నిండుగర్భిణిలా !
ప్రతిసావిట్లో పాలిచ్చే ఆవులు , గేదెలు .
పొలంలో దన్నిచ్చే ఎడ్లు , ఇతర గొడ్లు .
సంవత్సరమంతా పండినధాన్యం పురిలో ,
వైభవంగా జనులు తమతమ ఊరిలో !
ఏ శుభకార్యమొచ్చినా అంతా ఒక జట్టు ,
జన్మభూమి స్వేచ్ఛకు పరాక్రమమే మెట్టు .
జానపదాలు వినోదం , బంధుమిత్రులు వైభోగం .
మేళతాళాలు సంస్కృతి , విజయగాథలే కృతి .
