ప్రాసాక్షరి
ప్రాసాక్షరి
ప్రాసాక్షరి
వివి, నన, దద, గుగు, సుసు, మమ.
*చాలు మాధవా!*
(తేటగీతులు )
తా(వి )చిల్కు సుమములతో దండలల్లి
నీ(వి)లాసమున్ జేరితి వినతి వినుము!
క(న)వు నామోము? నీకింత కపటమేల?
వ(న)రుహనయనా!మాటాడవా ముకుంద?
నీ( ద)యను కురిపించుమా!నీరజాక్ష!
యే(ద)రికి బోవుదు?ధరలో నేది దిక్కు?
ది(గు)లు తోడనే క్రుంగితి దీననైతి
మ(గు)వ మానస మెఱుగవా మౌనమేల?
వి(సు)వు చాలించు మాధవా!విభుడవీవె!
క(సు)రుకొందువా? తెల్పుము కారణంబు!
కో(మ)లిని కష్టపెట్టుట గొప్పదనమ?
ప్రే(మ) చూపవు నామీద విముఖతేల?//
