STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Classics

4  

Dr.R.N.SHEELA KUMAR

Classics

గగనం

గగనం

1 min
12

గగనం అది అందని ఓ

అందమైన గమనం

నీలాకాశం చూసిన తరుణం

సముద్రపు అలల సవ్వడిలో

వుండే ఆ ఆనందం

నీలాకాశం, ఆ అలల సవ్వడి

చూసే ఆ కనుల చల్లదనం

చిన్ననాటి ఆ రోజుల

జ్ఞాపకాలు వెదజల్లే

ఆ సన్నివేశాల ఆహ్లాదం

ఆహా అదే మా ఊరు

పచ్చని చేను, సెలయేరు

ఆడుతూ పాడుతూ

చదువుతూ గడిపే

ఆ కాలం మరల

తిరిగి రాదని తెలిసిన

అది ఓ ఆనందం

ఆ మరపురాని రోజుల

సందడి గగనానికే ఓ గమనం 


Rate this content
Log in

Similar telugu poem from Classics