శోకించే వనితా
శోకించే వనితా
1 min
37
జీవితమనే వేదికలో
అందరూ నటులే
మనసు కి మమతలకి
దూరాలు, బంధాలు
విలువలు లేని ఈ సమాజం లో స్త్రీ ఓ
ఆటబొమ్మ గా మిగిలిపోయే
ఇదేరా జీవితం
భార్య అనే స్థానం కేవలం
సమాజానికి ఇచ్చే గుర్తింపు గా మిగిపోయే
ఈ తరుణం ఎవరికీ వారే యమునాతీరే
అనే ఆలాపనలో విలపించే విలాపమే
స్త్రీ జీవితం
కాలాలు మారినా ఎంతటి
చదువులు చదివినా స్త్రీ
మగని చేతులో కీలుబొమ్మ
తానాడే చదురంగం లో ఓ పాత్ర