కళ్యాణం
కళ్యాణం
ఒకరినొకరు చూసుకొని
కనులు కనులు కలుసుకొని
చేసిన బాసలు వీడని మమత
ఎన్నటికీ మాసిపోని మాయని మమతా
కలిసిన జీవితమే ఈ బంధం
ఎన్ని కష్టాలు వచ్చిన నీ చేయిని
విడువననే భరోసా ఇచ్చే ఆ బంధం
ఎన్ని జన్మలకైనా తరగనిప్రేమ
మీ బంధం అదే పాణిగ్రహ బంధం
ఎందరు మధ్యలో వచ్చిన
ఎన్ని అసలు చూపినా
నా అనే బంధం ఒక్క ఈ
వేద మంత్రాల సాక్షిగా
పెనవేసుకున్న ఆ బంధం
చివరి వరకు ఏ అరమరికలు
లేక సుఖసంతోషాలతో
జీవనం సాగాలి