అమ్మ అమ్మ ఎంతటి మహత్యమైన పిలుపు
అమ్మ అమ్మ ఎంతటి మహత్యమైన పిలుపు
అమ్మ అని పిలిచినా
మదిన ఎన్ని పులకింతలో
ఊహలకందని ఆనందం
మదిలో ఓ కీరవాణి రాగం
అమ్మ అని పిలిచే
రెండు పెదవుల సంగమం
అది జగనికే ఓ వరం
ఆకలి అని అడగక ముందే కడుపు నింపిన
ఆ అమ్మ ఎంతటి
సహనమూర్తి తాను
మేలుకొని బిడ్డను
నిద్రబుచ్చిన ఎన్ని
రాత్రులో ఎన్ని
నెలలో
నవమాసాలు మోసి కనిన
ఆ త్యాగమూర్తికివే నా
వందనాలు