STORYMIRROR

Yogi Gonuguntla

Tragedy

4  

Yogi Gonuguntla

Tragedy

అల్లకలలోలపు ఆలోచనలు

అల్లకలలోలపు ఆలోచనలు

1 min
447

అల్లాకలోలపు ఆలోచనలతో

పనికిమాలిన, పనికిరాని కావేషపు మాటలతో

మనసు చెడి, మతి గతులు తప్పుతున్నవేల...

ఈ ఆలోచనల ఆవేషo ఎందుకు.....?

ఉపయోగం లేని, చేవ చచ్చిన, చేతకాని పౌరష

భావావేషాతో ఈ పనికి రాని మాటల యుద్ధం ఎందుకు...

మాటల యుద్ధం వలన మనిషి ని మార్చగలమా

మౌనం వలన మార్చగలమా........

తెల్చలేని ఈ తెలివి లేని ఆలోచనలు ఎందుకు.......?

ముఖం మాడ్చి , ముఖ కవళికలు మార్చినంత మాత్రాన

మనసులోని భాధ కనపడినా....

ఆర్థం పర్థం లేని ఆవేశ భరిత ముఖ కవళికలు మార్చటమెందుకు.. ఎవరో ఎదో చేస్తారని, ఎవరో ఎదో మాట్లాడతారని, ఇంక ఎవరెవరో ఉద్ధరించలని

ఈ తపన ఎందుకు..........?

తపించే హృదయ మున్నప్పుడు ఎవరికోసమో తపన ఎందుకు, ఎదుటి వారికి లేని ప్రేమ ఆప్యాతలు నీ మనసుల కెందుకు..........?

దయ లేని ఈ ధరిద్రపు ధరిత్రి మీద, ఈ జాలి లేని జాగిలాల వంటి అలోచలతో ఈ స్వార్ధపు జీవనం ఎందుకు..................

జీవించలేని జడత్వమా జడ తత్వాల ను తెలుపుమా ........

నాకు తెలియక రాసుకుపోతున్ననా లేక నీకు తెలపగలనాన్న భ్రమ తో రాస్తున్ననో ...ఆర్థంకావటం లేదు..

ఆర్థంకాలేదో ,ఆర్ధం లేదో ఆర్ధమయి కూడా ఆర్దం కానట్టు వుందో ఆర్థం కావటం లేదు ఈ అల్లకల్లోల పు ఆలోచనలతో.............

వాదోపా వాదనలతో విలువలను తెంచి,ఆ విలువల గురించి చర్చించే చండాలపు ఆలోచనలతో.........

చావలేక బతుకుతున్న విలువలు లేని విగత జీవిగా...............


Rate this content
Log in

Similar telugu poem from Tragedy