జన్మభూమి
జన్మభూమి
ప౹౹
నా జన్మభూమి ఎన్నడు మరచిపోని ప్రదేశం మదిలోనే ఎపుడూ కదలాడూ ఆ సన్నివేశం ౹2౹
చ౹౹
బాల్యమెంత ముడివేసుకుందీ ఆ ప్రదేశంతో
సాఫల్యమంత చవిచూసానే తల్లి ఆదేశంతో ౹2౹
ఆ తలపులే తెరచునే మదివాకిటి తలుపులే
ఆ నెలవులే హృదయ నైర్మల్యాన్నీ తెలుపులే ౹ప౹
చ౹౹
ఒకసారి చూడాలనిపించి చూసానులే ఊరిని
వేసారిన హృదికీ కలిగే స్వాంతనము మరిని ౹2౹
కాని వృద్దులే మిగిలిరీ ఊరి మొత్తానికీ చూడ
ఏమని వర్ణింతునులే కనిపించిన ఆ ఒక తేడా ౹ప౹
చ౹౹
బాలురందరు చదువుపేరిట చేరిరి నగరాలకు
భావిపౌరులు ఉద్యోగాలకే చేరరా ఆ తీరాలకు ౹2౹
ఉండే జనాభా తగ్గిన ఊరిని ఏమని చెప్పనూ
నిండు జనంలేని జన్మస్థలం ఒకనాటి గొప్పను