STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వెళ్ళకు

వెళ్ళకు

1 min
2

వెళ్ళకు..
ఎవరి జీవితంలోకి వెళ్ళి అవమానపడకు.
మాటలతో మనసు ను బాధ పెడుతారు.
దేహానికి తెలియకుండా గాయం చేస్తారు.
ఊహల్లోకి తీసుకెళ్లి ఆదా: పాతాళానికి నెడుతారు.

కంటికి నిద్దుర కరువు చేస్తారు.
బ్రతికి ఉండగానే చావు చూపిస్తారు.
బ్రతుకు రాతను తల్ల కిందులు చేస్తారు.
సంతోషాన్ని దూరం చేస్తారు.
దుఃఖం తో సావాసం చేసేలా మార్చేస్తారు. 

అందరున్నా ఒంటరి వాళ్ళు గా మారుస్తారు.
ప్రతిరోజు కుమిలిపోయేల చేస్తారు.
నమ్మక ద్రోహం తలపెడుతారు.
ఎవర్ని నమ్మకుండా నయా వంచన చేస్తారు.

హృదయపు గదుల్లో వేదన మిగులుతారు.
ఊపిరున్నా జీవశ్చవాన్ని చేస్తారు.
తెలిసి వెళ్ళబోకు ఎవరి జీవితం లోకి 
నీకు నువ్వై.
               


Rate this content
Log in

Similar telugu poem from Classics