STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

భంగపాటు

భంగపాటు

1 min
20



నీ నవ్వుల సందడితో..మన్మథునకు భంగపాటు..! 
తప్పలేదు వికసించే..మల్లికలకు భంగపాటు..! 

శరత్కాల నవరాత్రుల..సంబరాలు ఏవైనా.. 
నీచెక్కిలి కాంతులతో..చంద్రికలకు భంగపాటు..!

ఓంకారపు స్వరధారగ..మారిననీ మౌనంలో.. 
వసంత గానమాలపించు..కోకిలలకు భంగపాటు..! 

గమనించే సంగతినే..మరిపించే మాయచిక్కు.. 
తాదాత్మ్యత సాక్షికాగ..తారకలకు భంగపాటు..! 

సంసారపు సారమింత..పట్టలేని యాతనలో.. 
ఊహలలో విహరించే..హంసికలకు భంగపాటు..! 

జారుచెమట చుక్కగుండె..సడిని వినే వీనులేవి.. 
అసలుప్రేమ పట్టెరుగని..పాలకులకు భంగపాటు..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics