నీ జ్ఞాపకాల
నీ జ్ఞాపకాల
నీ జ్ఞాపకాల పరిమళం
నీ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉంది,
నన్ను తరిమి తరిమి కొడుతోంది!
నీ పెదవులపై దాగున్న రహస్యం,
నన్ను చుట్టుముట్టేస్తోంది!
నీ నుదుటి కుంకుమ బొట్టు,
నా హృదయంపై శాశ్వత ముద్ర వేస్తోంది,
నీ మేని రంగు, నా ఊహలకు రెక్కలు తొడుగుతోంది!
నీ చీర కొంగులో దాక్కున్న పారవశ్యం,
నన్ను పులకించింపచేస్తోంది,
నీ కదిలే కనురెప్పలు, నా కలలను అల్లుతున్నాయి!
నీ ప్రతి అడుగు, నా జీవితానికి కొత్త శోభను ఇస్తోంది,
నీ ప్రతి శ్వాస, నా శ్వాసతో మిళితమవుతోంది!
ఈ అనంత విశ్వంలో, నీ కోసం నా ప్రయాణం సాగుతూనే ఉంది
