ఆ సౌందర్యా దృశ్యం
ఆ సౌందర్యా దృశ్యం
అప్పుడే మొదలైంది. ఢమ ఢమల ఉరుములతో,
ధగ ధగ ల మెరుపులతో ఆమెను ఆక్రమించాలనే తపనలతో
వరుణుడు ఆగమేగాలపై లంఘించుచున్నాడు..
తన అకాల ఆగమనమును గుర్తెరిగిన ఆమె ఏక ఉదుటున లేచి నిల్చున్నది..
ఆ పడతి సౌందర్య రక్షణకు మయూరములే పురివిప్పి నిల్చున్నవి..
పుడమిని ముద్దాడే ఆమె నీలి కేశములు వ్రేల్లాడే లతల్లా
ఆమె హృదయ గోపురముల పై నుంచి జాలువారి ఉన్నాయి..
మయూరముల చాటున పదయారు గజముల చీరను చుట్టి..
ముత్యాల హారాలు ముత్తైదుగ పెట్టి కస్తూరి తిలకము కడు
రమ్యముగ రాసి కాటుక కన్నులతో, నేరేడు కనుపాపలతో,
నెలవంక కనుసోగలతో, శంఖపు మెడ వంపులతో,
మధుర తొనల అధరములతో,లయనానందకరిలా,
పురివిప్పిన శ్వేత మయూరములాగులాబీ వర్ణ పాద సౌకుమార్యముతో..
చెంగు చెంగున పసిడి లేడిలా కొంగైకెత్తుకొని సప్త స్వరాల అందియలను
మీటుతూ కళ్ళముందే కదలిపోయింది.. !!
లిప్త కాలములో జరిగిన ఆ సౌందర్య దృశ్యం
ఆఖరి కట్టె కాలేవరకు కళ్ళముందే కదులుతూ ఉంటుంది..!!

